పోకిరీలా మారిన కానిస్టేబుల్.. మహిళను అసభ్యంగా తాకుతూ పిచ్చి వేషాలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-25 04:50:32  IST  )

కంచె చేను మేసినట్లుగా తయారైంది నగరంలోని పోలీసుల పరిస్థితి.

పోకిరీలా మారిన కానిస్టేబుల్.. మహిళను అసభ్యంగా తాకుతూ పిచ్చి వేషాలు
X

దిశ, వెబ్‌‌డెస్క్: కంచె చేను మేసినట్లుగా తయారైంది నగరంలోని పోలీసుల పరిస్థితి. రాష్ట్రంలో మహిళల భద్రతను పర్యవేక్షించాల్సిన ఖాకీలు తప్పటడుగులు వేస్తున్నారు. గౌరవప్రదమైన వృత్తిలో ఉండి అల్లరి చిల్లర వేషాలు వేస్తూ చివరికి కటకటలాపాలు అవుతున్నారు. తాజాగా, అచ్చం అలాంటి ఘటనే హైదరాబాద్ నగరంలోని మధురానగర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పోలీసు శాఖలో విధులు నిర్వర్తిస్తున్న ఓ ఏఆర్ కానిస్టేబుల్‌ సభ్యతను మరిచి బైక్‌పై వెళ్తూ రోడ్డు మీద నడుస్తున్న ఓ మహిళను అసభ్యకరంగా తాకాడు. చేసింది తప్పని.. ప్రశ్నించిన బాధితురాలిపై దాడికి ప్రయత్నించాడు. ఈ మేరకు సదరు మహిళ జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలపడంతో వారు మధురానగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఆ పోకిరీ పోలీసును అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.

Next Story