కీలక పరిణామం.. కానిస్టేబుల్ హత్య కేసు నిందితుడు రియాజ్ అరెస్ట్

by Malleboina Mahesh |

నిజామాబాద్ జిల్లాలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రమోద్ హత్యకు గురైన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం గా మారిన విషయం తెలిసిందే.

కీలక పరిణామం.. కానిస్టేబుల్ హత్య కేసు నిందితుడు రియాజ్ అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: నిజామాబాద్ జిల్లాలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రమోద్ హత్య (Pramod murder)కు గురైన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం గా మారిన విషయం తెలిసిందే. వాహనాల దొంగతనాలు, చైన్ స్నాచింగ్ నేరాలకు పాల్పడుతున్న షేక్ రియాజ్ (Sheikh Riaz) ఆచూకీ సమాచారం లభించిన వెంటనే అతడిని పట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు తీసుకొస్తున్న కానిస్టేబుల్ ప్రమోద్‌ను నిందితుడు కత్తితో పొడిచి పరారయ్యాడు. ఈ ఘటనపై స్పందించిన డీజీపీ శివధర్‌రెడ్డి (DGP Shivdhar Reddy) సీరియస్ అయ్యారు.

సిన్సియర్‌గా విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హత్య చేసిన షేక్ రియాజ్‌ను వెంటనే పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్‌ను ఆదేశించారు. దీంతో అనేక బృందాలుగా విడిపోయిన పోలీసులు.. ఈ రోజు మధ్యాహ్నం సారంగపూర్ సమీపంలో షేక్ రియాజ్ (Sheikh Riaz) ను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసి నిందితుడిని పోలీసులు నిజామాబాద్ కు తరలిస్తున్నట్లు తెలుస్తుంది.

Next Story