కాంగ్రెస్ పార్టీలో కీచక నాయకుడు.. మహిళల ఫొటోల మార్ఫింగ్ చేసి వెబ్ సైట్స్‌లో అప్ లోడ్..

by Sujitha Rachapalli |

మహిళల సెక్సువల్ హరాజ్మెంట్ కేసులో కర్ణాటక కాంగ్రెస్ నాయకుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. చిక్కమగళూరు జిల్లా అల్దూర్ హోబ్లీకి చెందిన ఆదిత్య యూత్ కాంగ్రెస్ మాజీ ఉపాధ్యక్షుడు‌గా పని చేశాడు. జిల్లా స్థాయిలో యాక్టివ్‌గా

కాంగ్రెస్ పార్టీలో కీచక నాయకుడు.. మహిళల ఫొటోల మార్ఫింగ్ చేసి వెబ్ సైట్స్‌లో అప్ లోడ్..
X

దిశ,వెబ్ డెస్క్ : మహిళల సెక్సువల్ హరాజ్మెంట్ కేసులో కర్ణాటక కాంగ్రెస్ నాయకుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. చిక్కమగళూరు జిల్లా అల్దూర్ హోబ్లీకి చెందిన ఆదిత్య యూత్ కాంగ్రెస్ మాజీ ఉపాధ్యక్షుడు‌గా పని చేశాడు. జిల్లా స్థాయిలో యాక్టివ్‌గా ఉన్నాడు. అయితే ఆన్‌లైన్‌లో మహిళలను సైబర్ స్టాకింగ్ చేస్తున్నాడని, లైంగికంగా వేధిస్తున్నాడనే ఆరోపణలు వచ్చాయి. ఫొటోలను మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని అక్టోబర్ 28న జయనగర్‌కు చెందిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

సోషల్ మీడియా ద్వారా అమ్మాయిలను ఫ్రెండ్స్‌గా చేసుకుని.. అనుచిత సందేశాలు పంపుతున్నాడని, చంపేస్తానని బెదిరిస్తున్నాడని ఇప్పటికే ముగ్గురు మహిళల నుంచి ఆరోపణలు వచ్చాయి. మహిళల ఫొటోలను అసభ్య కంటెంట్‌గా మార్చి వెబ్ సైట్స్‌లో అప్ లోడ్ చేస్తున్నాడని, మెసేజింగ్ యాప్స్‌ ద్వారా స్ప్రెడ్ చేస్తున్నాడని ఫిర్యాదు చేశారు. మొత్తానికి డిజిటల్ ట్రాకింగ్‌ ద్వారా ఈ పని చేస్తుంది ఆదిత్య అని కన్ఫర్మ్ చేసుకున్న పోలీసులు.. అతన్ని జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకున్నారు. ఫోన్, ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ విశ్లేషణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక స్థానికులు ఆదిత్యపై కోపంతో దేహశుద్ధి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతన్ని బయటకు లాగి బెల్ట్‌తో కొట్టిన మహిళలు.. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Next Story