- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల పేరిట డబ్బులు వసూలు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల పేరిట డబ్బులు వసూలు చేస్తున్న ఘటన కలకలం రేపింది.

దిశ, వేములవాడ : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల పేరిట డబ్బులు వసూలు చేస్తున్న ఘటన కలకలం రేపింది. ఈ అంశంపై ఒక ఆడియో క్లిప్ ఇటీవల సామాజిక మాధ్యమాలలో వైరల్ అయింది. ఈ ఆడియో క్లిప్ దేవస్థానం అధికారుల దృష్టికి రావడంతో, వెంటనే విచారణ చేపట్టారు. ఆడియోలో ఉన్న గొంతు దేవస్థానంలో ఔట్ సోర్సింగ్ సిబ్బందిని సరఫరా చేసే ఏజెన్సీలకు సూపర్‌వైజర్‌గా ఉన్న బూర్ల లక్ష్మినారాయణదిగా గుర్తించారు. ఇతను ప్రణయన్ హౌస్ కీపింగ్ & సెక్యూరిటీ సర్వీసెస్, శాన్వి సర్వీసెస్, శివ బాలాజీ కన్సల్టెన్సీలకు సంబంధించి పనిచేస్తున్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఆదేశాల మేరకు వేములవాడ పోలీస్ స్టేషన్‌లో బూర్ల లక్ష్మినారాయణపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కమిషనర్ దేవాదాయ ధర్మాదాయ శాఖ, హైదరాబాద్ రీజినల్ జాయింట్ కమిషనర్ ఎం. రామకృష్ణారావు, డిప్యూటీ కమిషనర్ టి. వెంకటేష్ లను ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేసి నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించారు. దీంతో బుధవారం వారు వేములవాడ దేవస్థానాన్ని సందర్శించిన విచారణ చేపట్టారు. ప్రస్తుతం ఈ వ్యవహారం మీద స్థానికంగా తీవ్ర చర్చ సాగుతోంది. దేవస్థానంలో పారదర్శకత, పరిరక్షణకు కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.






