- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, రైల్వే సూపరింటెండెంట్ అరెస్ట్
హైదరాబాద్ శివారులోని మోకిలా పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుబడటం కలకలం రేపింది. అత్యంత ఖరీదైన 'కొకైన్' విక్రయిస్తున్న ముఠాను మోకిలా పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

దిశ, శంకర్ పల్లి: హైదరాబాద్ శివారులోని మోకిలా పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుబడటం కలకలం రేపింది. అత్యంత ఖరీదైన 'కొకైన్' విక్రయిస్తున్న ముఠాను మోకిలా పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ముఠాలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగితో పాటు ప్రముఖ టెక్ సంస్థ గూగుల్‌లో పనిచేసే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉండటం గమనార్హం. పోలీసుల కథనం ప్రకారం.. రైల్వే శాఖలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ఒక వ్యక్తి ఈ డ్రగ్స్ దందాకు ప్రధాన సూత్రధారిగా వ్యవహరిస్తున్నాడు. ఈ కేటుగాడు బెంగళూరు, గోవా వంటి ప్రాంతాల నుండి ఖరీదైన కొకైన్‌ను హైదరాబాద్‌కు స్మగ్లింగ్ చేస్తున్నాడు. సొంత కారులోనే డ్రగ్స్ తరలిస్తూ ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్త పడుతున్నాడు.
గూగుల్ ఉద్యోగి, వ్యాపారవేత్త అరెస్ట్..
పక్కా సమాచారం అందుకున్న పోలీసులు మోకిలా ప్రాంతంలో నిఘా పెట్టి, డ్రగ్స్ విక్రయిస్తుండగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో రైల్వే సూపరింటెండెంట్ (ప్రధాన సరఫరాదారు), గూగుల్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, మరో ప్రముఖ వ్యాపారవేత్త ఉన్నారు. వీరి వద్ద నుండి దాదాపు 40 గ్రాముల కొకైన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ లక్షల్లో ఉంటుందని అంచనా. నిందితులు డ్రగ్స్ తరలింపుకు వాడుతున్న రెండు విలాసవంతమైన కార్లను పోలీసులు సీజ్ చేశారు. బెంగళూరు, గోవా నుండి ఈ డ్రగ్స్ నెట్‌వర్క్ ఎలా సాగుతోంది? హైదరాబాద్‌లో ఇంకా ఎవరెవరికి వీరు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు? అనే కోణంలో పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు. కేవలం విక్రయదారులే కాకుండా, వీరి వద్ద డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న 'కస్టమర్ల' జాబితాను కూడా పోలీసులు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.






