వారణాసిలో తెలంగాణ వాసులు మృతి.. CM రేవంత్ దిగ్భ్రాంతి

by Gantepaka Srikanth |

ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లోని వారణాసి(Varanasi)లో జరిగిన రోడ్డు ప్రమాదం(Road Accident)లో సంగారెడ్డి జిల్లా వాసులు మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

వారణాసిలో తెలంగాణ వాసులు మృతి.. CM రేవంత్ దిగ్భ్రాంతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లోని వారణాసి(Varanasi)లో జరిగిన రోడ్డు ప్రమాదం(Road Accident)లో సంగారెడ్డి జిల్లా వాసులు మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించడంతో పాటు తక్షణమే సహాయక చర్యలు అందించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ అధికారులతో మాట్లాడాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు.

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ ఇరిగేషన్‌ డీఈ వెంకటరామిరెడ్డి(Zaheerabad Irrigation DE Venkatarami Reddy) తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాగ్‌రాజ్‌(Prayagraj)లో జరుగుతున్న మహా కుంభమేళా(Maha Kumbh Mela)కు వెళ్లారు. పుణ్యస్నానం ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో వారణాసి వద్ద వారు ప్రయాణిస్తున్న కారు టిప్పర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జహీరాబాద్ ఇరిగేషన్ డీఈ వెంకటరామిరెడ్డి (46), భార్య విలాసిని (40), అలాగే కారు డ్రైవర్ మల్లారెడ్డి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా వెంకటరామిరెడ్డి స్వగ్రామం న్యాల్‌కల్ మండలం మామిడ్గీ వాసులుగా గుర్తించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అలాగే ప్రమాద విషయాన్ని మృతుల కుటుంబసభ్యులకు తెలియజేశారు.

Next Story