- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫామ్‌హౌజ్‌లో రాసలీలల ఎఫెక్ట్: ఉద్యోగ నుంచి సస్పెండ్.. పరారీలో CI మల్లయ్య
శాంతిభద్రతలను కాపాడాల్సిన ఒక బాధ్యతాయుతమైన పోలీస్ అధికారి కామాంధుడిగా మారి కీచక పర్వానికి తెరలేపారు.

దిశ, వెబ్‌డెస్క్: శాంతిభద్రతలను కాపాడాల్సిన ఒక బాధ్యతాయుతమైన పోలీస్ అధికారి కామాంధుడిగా మారి కీచక పర్వానికి తెరలేపారు. పల్నాడు జిల్లాలో వీఆర్ (VR)లో ఉన్న సీఐ చిన మల్లయ్యపై అత్యాచారం కేసు నమోదు కావడమే కాకుండా, ఆయన రాసలీలలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం జిల్లావ్యాప్తంగా కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. వినుకొండ మండలం బ్రాహ్మణపల్లిలో ఒక ఫాంహౌస్‌ను ఏర్పాటు చేసుకున్న సీఐ మల్లయ్య, అక్కడ మహిళలతో రాసలీలు సాగించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వినుకొండ పోలీస్ స్టేషన్‌లో ఆయనపై అత్యాచారం కేసు నమోదైంది. ఈ కేసులో బాధితురాలు ఇప్పటికే న్యాయస్థానంలో మేజిస్ట్రేట్ ముందు తన వాంగ్మూలాన్ని (Statement) కూడా ఇచ్చింది.
పరారీలో సీఐ.. పోలీసుల గాలింపు..
కేసు నమోదైన విషయం తెలుసుకున్న సీఐ మల్లయ్య అజ్ఞాతంలోకి వెళ్లారు. నిందితుడిని అరెస్ట్ చేయాల్సిందిగా జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆదేశించడంతో, ఆయన కోసం రెండు ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే, కేసు విచారణలో ఉండగానే మరో మహిళతో సీఐ జరిపిన శృంగార వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడం అధికారులను ఉలిక్కిపడేలా చేసింది. సీఐ మల్లయ్య పరారీ వెనుక పోలీసు శాఖలోని కొందరు ఉన్నతాధికారుల లేదా సహచరుల హస్తం ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కేసు నమోదైన వెంటనే అరెస్ట్ చేయకుండా కాలయాపన చేయడం వల్లే ఆయనకు తప్పించుకునే అవకాశం దక్కిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొందరు పోలీసులే ఆయనకు సహకరించారనే వార్తలు శాఖలో చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న ఎస్పీ కృష్ణారావు.. సీఐ మల్లయ్యపై కఠిన చర్యల కోసం ఐజీకి నివేదిక పంపినట్లు సమాచారం. పరారీలో ఉన్న మల్లయ్య త్వరలోనే పట్టుబడతారని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రక్షక భటుడే భక్షకుడిగా మారిన ఈ ఘటన పోలీసు శాఖ ప్రతిష్టను మంటగలిపిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.






