- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిన్నారి నోటిలో పేలిన చాక్లెట్.. చీలిపోయిన దవడ, పెదాలు
చిన్నపిల్లలకు చాక్లెట్లు, బిస్కెట్లు అంటే ఎంతో ఇష్టం. అడిగింది కొనిచ్చే వరకూ మారాం చేస్తారు.

దిశ, వెబ్‌డెస్క్: చిన్నపిల్లలకు చాక్లెట్లు, బిస్కెట్లు అంటే ఎంతో ఇష్టం. అడిగింది కొనిచ్చే వరకూ మారాం చేస్తారు. అలా మూడేళ్ల కూతురు చాక్లెట్ అడిగితే ఓ షాపుకు తీసుకెళ్లి కొనిచ్చింది తల్లి. దానిని తీసి నోటిలో పెట్టుకుని కొరికే సరికి చిన్నారి నోటిలోనే చాక్లెట్ పేలింది. దీంతో బాలిక దవడ చీలిపోయింది. తీవ్రంగా గాయపడిన కూతురిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా.. వైద్యులు చీలిన దవడకు చికిత్స చేసి, కుట్లు వేశారు. ప్రస్తుతం బాలిక కోలుకుంటోందని వైద్యులు తెలిపారు. రాజస్థాన్లోని అల్వార్ రోడ్డులో చౌకి బాస్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
చిన్నారి తల్లి తెలిపిన వివరాల ప్రకారం.. తన కూతురు అక్షు (3)కు ఊర్లోనే ఉన్న కిరాణా కొట్టులో చాక్లెట్ కొనిచ్చింది. ఎంతో ఇష్టంగా దానిని నోటిలో పెట్టుకోగా అది పేలిపోయింది. దీంతో పెదాలు, దవడలు చీలిపోయాయి. వెంటనే అల్వార్లో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు ట్రీట్మెంట్ చేశారు. ప్రస్తుతం బాలిక ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు రామ్ గఢ్ ఎస్ హెచ్ఓ విజయేంద్ర సింగ్ తెలిపారు. ఈ ఘటనపై చిన్నారి అత్త నికిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. సుదీల్ అలియాస్ కలా.. అక్షుకి గన్ పౌడర్ ఉన్న ఫైర్ క్రాకర్ చాక్లెట్ ఇవ్వడంతో ఆమె తీవ్రంగా గాయపడిందని, దీనివల్ల అక్షు ఎంతో బాధపడుతోందని ఫిర్యాదులో పేర్కొంది. ఆ సమయంలో తనకూతురు అహానా కూడా అక్కడికి కూల్ డ్రింక్ తాగేందుకు వెళ్లగా.. చాక్లెట్ పేలడంతో కూల్ డ్రింక్ బాటిల్ కూడా పగిలిందని పోలీసులకు తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసి సుదీల్ ను అరెస్ట్ చేశారు. ఫోరెన్సిక్ పరీక్షల నివేదిక వచ్చాక చర్యలు చేపడుతామని, అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ పింటూ కుమార్ తెలిపారు.






