35 మందిని కారుతో తొక్కి చంపిన కేసులో కోర్టు సంచలన తీర్పు

by Yella Dhawani Reddy |

చైనాలో ఇటీవల జరిగిన ఘోర ప్రమాదకర ఘటనలో కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది.

35 మందిని కారుతో తొక్కి చంపిన కేసులో కోర్టు సంచలన తీర్పు
X

దిశ, వెబ్ డెస్క్: చైనాలో ఇటీవల జరిగిన ఘోర ప్రమాదకరమైన ఘటనలో ఆ దేశ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. 35 మంది ప్రాణాలను పొట్టనబెట్టుకున్న నిందితుడికి మరణ శిక్ష విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని చైనా అధికారిక మీడియా వెల్లడించింది. వివరాల్లోకి వెళ్లితే.. చైనాకు చెందిన ఫాన్ వీకియూ(62) అనే వ్యక్తి గతేడాది నవంబర్ 11న ఝుహాయ్ నగరంలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ బయట అత్యంత వేగంగా నిర్లక్ష్యంగా కారును నడిపాడు. దీంతో అక్కడ వ్యాయామం చేస్తున్న వారిపైకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 35 మంది చనిపోగా, 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన అనంతరం నిందితుడు అక్కడే కారులో తనను తాను కత్తితో పొడుచుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. కోమాలోకి వెళ్లిన నిందితుడిని పోలీసులు ఆస్పత్రిలో చేర్పించారు. అయితే, ఇటీవలే భార్యతో విడాకులు తీసుకున్నాడని, ఆస్తి పంపకంలో వివాదాలతో మానసిక సమస్యల కారణంగా ఈ ఘాతాకానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇక ఈ కేసుపై చైనా సుప్రీం కోర్టు తాజాగా విచారణ చేపట్టింది. ఈ ఘటన అత్యంత ఘోరమైనదని పేర్కొంటూ నిందితుడికి మరణ శిక్షను విధించింది.

Next Story