చిలుకూరు దేవాలయం హుండీలో నగదు చోరీ..

by Bhanu |

నల్లగొండ జిల్లాలోని దేవాలయం హుండీలోని నగదు చోరీ అయిన ఘటన మండలంలో చోటుచేసుకుంది.

చిలుకూరు దేవాలయం హుండీలో నగదు చోరీ..
X

దిశ, చిలుకూరు: నల్లగొండ జిల్లాలోని దేవాలయం హుండీలోని నగదు చోరీ అయిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. ఆలయ కమిటీ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రం చిలుకూరులోని పాత చిలుకూరు కాటమయ్య గుడి హుండీని మంగళవారం రాత్రి దుండగులు గడ్డపారతో పగలకొట్టి అందులోని నగదును అపహరించారు. ఈ దేవాలయంలో గౌడ కులస్తుల ఆరాధ్యుడైన కాటమయ్య ప్రతిమను ఇటీవలే ప్రతిష్టించారు. హుండీని ధ్వంసం చేసేందుకు వినియోగించిన గడ్డపారను దుండగులు సమీప పొలంలో విసిరేసి వెళ్లారు. ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.

దేవుడి సొమ్ముకూ రక్షణ కరవాయె..!

హుండీ ఘటన మండలంలో ఇదే మొదటిసారి కాదు. గతంలో నారాయణపురం కాటమయ్య గుడి, చిలుకూరు ఆంజనేయ స్వామి దేవాలయంలో కూడా హుండీలను అగంతుకులు ఎత్తుకెళ్లి వాటిలోని నగదు చోరీ చేశారు. కొందరు నిందితులను గుర్తించి రిమాండ్ కు తరలించారు. చోరీకి గురైన నగదు మాత్రం రికవరీ కాలేదు. దేవాలయాల హుండీల చోరీపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Next Story