పిల్లలు పుట్టడం లేదని మహిళను సజీవ దహనం చేసిన అత్తామామలు.. అడ్డుకున్న పోలీసులపై దాడి

by Sujitha Rachapalli |   (  Updated:2025-09-17 12:29:02  IST  )

రాజస్థాన్ దీగ్ జిల్లా అల్వార్‌లో దారుణం చోటు చేసుకుంది. పిల్లలు పుట్టట్లేదని 42ఏళ్ల మహిళను సజీవ దహనం చేశారు అత్తామామలు. ఆవు పిడకలపై పడుకోబెట్టి నిప్పంటించారు. ఆమె చనిపోయాక.. సగం కాలిన శరీరానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.

పిల్లలు పుట్టడం లేదని మహిళను సజీవ దహనం చేసిన అత్తామామలు.. అడ్డుకున్న పోలీసులపై దాడి
X

దిశ, వెబ్ డెస్క్: రాజస్థాన్ దీగ్ జిల్లా అల్వార్‌లో దారుణం చోటు చేసుకుంది. పిల్లలు పుట్టట్లేదని 42ఏళ్ల మహిళను సజీవ దహనం చేశారు అత్తామామలు. ఆవు పిడకలపై పడుకోబెట్టి నిప్పంటించారు. ఆమె చనిపోయాక.. సగం కాలిన శరీరానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. విషయం తెలిసిన బాధిత మహిళ సరళా దేవి సోదరుడు విక్రాంత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంతానం లేనందుకు చాలా ఏళ్లుగా భర్త అశోక్, అత్తామామలు రాజవతి, సుఖ్‌బీర్ సింగ్, బావ మరిది త్రిలోక్ రాజ్, ఆడపడుచులు పూజా, పూనమ్ చిత్రహింసలు పెడుతున్నారని.. ఇప్పుడు చంపేశారని కేసు పెట్టాడు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. గ్రామంలోకి ఎంటర్ అయ్యేందుకు ప్రవేశించగా.. గ్రామస్తులు అడ్డుకున్నారు. పోలీసుల యూనిఫామ్ చింపి.. ఉరికిస్తూ కొట్టారు. అక్కడి నుంచి తప్పించుకుని సీనియర్ ఆఫీసర్స్‌ను కలిసిన పోలీసులు.. అడిషనల్ ఫోర్సెస్‌తో గ్రామానికి చేరుకున్నారు. బాడీని రికవర్ చేసిన పోలీసు ఆఫీసర్స్.. జిల్లా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. హత్య, ఆధారాలను నాశనం చేయడం, గవర్నమెంట్ అఫిషియల్స్‌పై దాడి కింద కేసు పెట్టినట్లు చెప్పారు.

Next Story