- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్కూల్ టీచర్ల ఎఫైర్.. కొడుకుకు తెలిసిందని.. బాలుడిని చంపి, శవాన్ని కాల్చేసిన తల్లి
బీహార్ పాట్నాలో దారుణం జరిగింది. లవ్ ఎఫైర్‌ను వ్యతిరేకిస్తున్నాడని ప్రియుడితో కలిసి కన్న కొడుకును చంపింది తల్లి. ఎవరికీ తెలియకుండా పొదల్లో శవాన్ని కాల్చేసి చేతులు దులుపుకుంది. కానీ పోలీసులు కేసు నమోదు చేసుకుని

దిశ, వెబ్‌సైట్ : బీహార్ పాట్నాలో దారుణం జరిగింది. లవ్ ఎఫైర్‌ను వ్యతిరేకిస్తున్నాడని ప్రియుడితో కలిసి కన్న కొడుకును చంపింది తల్లి. ఎవరికీ తెలియకుండా పొదల్లో శవాన్ని కాల్చేసి చేతులు దులుపుకుంది. కానీ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించడంతో అసలు విషయం బయటపడింది. బీపీఎస్సీ టీచర్ రోమా.. రోహ్తాస్‌లోని ప్రైమరీ టీచర్ ట్రెయినింగ్ కాలేజీ ప్రిన్సిపల్ నిర్మల్‌ను ట్రెనింగ్ టైమ్‌లో కలిసింది. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య ఇల్లీగల్ ఎఫైర్ స్టార్ట్ అయింది. అయితే ఈ విషయం తెలిసిన బాలుడు వ్యతిరేకించాడు.
దీంతో జీర్ణించుకోలేని తల్లి ప్రియుడు నిర్మల్‌తో కలిసి చనిపోయే వరకు పిల్లాడిని గొడ్డును బాదినట్లు బాదింది. ఆ తర్వాత చెట్ల పొదల్లో పడేసి బాలుడి శవాన్ని కాల్చేసింది. కాగా కొడుకు కనిపించడం లేదని భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు నిజం బయటపడింది. తల్లే కొడుకును చంపిందని తేలింది. తన భార్య క్యారెక్టర్‌లెస్ అని తనకు ముందే తెలుసని.. ఆమె చేసిన పనికి ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నాడు బాధిత తండ్రి.






