- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శనగగింజ గొంతులో ఇరుక్కొని చిన్నారి మృతి
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది.

X
దిశ, వెబ్ డెస్క్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ చిన్నారి గొంతులో శనగ గింజ ఇరుక్కుపోవడంతో ఊపిరి ఆడక మరణించింది. పోలీసుల వివరాల ప్రకారం కొమురంభీం జిల్లా కౌటాల మండలం కనికిలో ఈ ఘటన జరిగింది. తండ్రితో కలిసి సంతకు వెళ్లిన రిషి అనే నాలుగేళ్ళ చిన్నారి, శనగలు కావాలని మారం చేయడంతో, తండ్రి కొనిచ్చాడు. అకస్మాత్తుగా ఓ శనగ విత్తనం గొంతులో ఇరుక్కుపోయింది.
ఊపిరి ఆడక విలవిలలాడుతున్న చిన్నారిని హుటాహుటిన మంచిర్యాల ఆసుపత్రికి తరలించగా అప్పటికే చిన్నారి మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు. కాగా అంతవరకు తమ కళ్ళముందు ఆడుకుంటున్న చిన్నారి మృత్యువు పాలవడంతో తల్లిదండ్రులు, బంధువులు శోక సముద్రంలో మునిగిపోయారు.
Next Story






