బొమ్మ పైన పడి చిన్నారి మృతి

by Ajay Maddhiboyina |   (  Updated:2026-02-12 14:07:58  IST  )

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆడుకునే సమయంలో బొమ్మ పైన పడి చిన్నారి మృతి చెందింది. వివ‌రాల్లోకి వెళితే.. ఈ ఘ‌ట‌న జిల్లాలోని పి.గ‌న్న‌వ‌రం మండ‌లం జి. పెద‌పూడిలో చోటు చేసుకుంది.

బొమ్మ పైన పడి చిన్నారి మృతి
X

దిశ‌, వెబ్ డెస్క్: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆడుకునే సమయంలో బొమ్మ పైన పడి చిన్నారి మృతి చెందింది. వివ‌రాల్లోకి వెళితే.. ఈ ఘ‌ట‌న జిల్లాలోని పి.గ‌న్న‌వ‌రం మండ‌లం జి. పెద‌పూడిలో చోటు చేసుకుంది. గ్రామంలోని ఎంపీపీ ప్రాథ‌మిక పాఠ‌శాల ఆవ‌ర‌ణ‌లో ఆడుకుంటుండ‌గా చిన్నారిపై జింక‌బొమ్మ ప‌డింది. అది బ‌రువుగా ఉండ‌టంతో చిన్నారికి తీవ్ర‌గాయాలు అయ్యాయి. వెంట‌నే చిన్నారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా అప్ప‌టికే మృతి చెందిన‌ట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘ‌ట‌న చిన్నారి కుటుంబంలో, గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. చిన్నారి త‌ల్లిదండ్రులు, కుటుంబ స‌భ్యులు గుండెలు ప‌గిలేలా ఏడ్చారు. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు.

Next Story