చేవెళ్ల బస్సు ప్రమాదం.. 17కు చేరిన మృతుల సంఖ్య

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-03 03:36:00  IST  )

రంగారెడ్డి జిల్లాలో తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ ఢీకొట్టింది.

చేవెళ్ల బస్సు ప్రమాదం.. 17కు చేరిన మృతుల సంఖ్య
X

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లాలో తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ ఢీకొట్టింది. దీంతో బస్సుపై కంకర లోడు పడిపోవడంతో పలువురు ప్రయాణికులు అందులో కూరుకుపోయారు. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు 17 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మూడు జేసీబీల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. కంకరలో కూరుకుపోయిన వారిని ఒక్కొక్కరిని బయటకు తీస్తున్నారు. అయితే, ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఆర్టీసీ బస్సు తాండూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సులో సుమారు 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వారిలో ఎక్కువగా విద్యార్థులు, ఉద్యోగులు ఉన్నారని, హైదరాబాద్‌లోని పలు కళాశాలల్లో చదువుతున్నట్లు తెలుస్తోంది. ఆదివారం హాలిడే కావడంతో ఇళ్లకు వెళ్లి తిరిగి హైదరాబాద్‌కు వస్తున్న క్రమంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

Read More..

ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కంకర లారీ.. ఏకంగా 15 మంది దుర్మరణం

మీర్జాగూడ ప్రమాదంలో 17కి చెరిన మృతుల సంఖ్య.. సీఎం రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి

Next Story