- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తలకు ప్లాస్టిక్ కవర్.. హీలియం గ్యాస్ పెట్టుకుని వ్యక్తి ఆత్మహత్య.. ఎందుకంటే.?
తలకు ప్లాస్టిక్ కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పెట్టుకుని చార్టెడ్ అకౌంట్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలో బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో : తలకు ప్లాస్టిక్ కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పెట్టుకుని చార్టెడ్ అకౌంట్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలో బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ప్రాథమిక సమాచారం మేరకు గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలోని రాజరాజేశ్వరి కాలనీలోని ఓ సర్వీస్ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న సురేష్ రెడ్డి (28) మణికొండ లోని ఓ కంపెనీలో చార్టెడ్ అకౌంటెంట్ గా పని చేస్తున్నాడు.
గత కొంతకాలంగా మానసిక ఒత్తిడితో బాధపడుతున్న సురేష్ ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సూసైడ్ నోట్ రాసి తలకు ప్లాస్టిక్ కవర్ చుట్టుకుని హీలియం గ్యాస్ పెట్టుకుని సురేష్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.






