కొత్తపేటలో దొంగల స్వైర విహారం

by Bhanu |

కొత్తపేటలో దొంగలు స్వైర విహారం చేస్తున్నారు. రాత్రిపూట కాలనీలలో తిరుగుతూ దొంగతనానికి పాల్పడుతుండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

కొత్తపేటలో దొంగల స్వైర విహారం
X

దిశ, చైతన్యపురి : కొత్తపేటలో దొంగలు స్వైర విహారం చేస్తున్నారు. రాత్రిపూట కాలనీలలో తిరుగుతూ దొంగతనానికి పాల్పడుతుండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. దొంగతనానికి పాల్పడినట్లు అక్కడి సీసీ కెమెరాలలో రికార్డయింది. కొత్తపేట విలేజ్ ప్రభుత్వ పాఠశాల సమీపంలో బుధవారం రాత్రి ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు యాక్టివా వాహనంపై వచ్చి రోడ్డు పక్కన నిలిపి ఉన్న ఆటోయొక్క టైర్లు దొంగిలించారు. ఇదే ప్రాంతంలో వారంరోజుల క్రితం ఆవులు, మేకలను కూడా ఎత్తుకుని వెళ్లినట్లు కాలనీ వాసులు తెలిపారు. ఈ విషయమై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు పెట్రోలింగ్ చేస్తే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయని చెబుతున్నారు.

Next Story