రైల్వే అధికారి రాజశేఖర్‌పై CBI కేసు నమోదు

by Gantepaka Srikanth |

దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) అధికారి రాజశేఖర్‌(Rajasekhar)పై సీబీఐ కేసు(CBI Case) నమోదు అయింది.

రైల్వే అధికారి రాజశేఖర్‌పై CBI కేసు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) అధికారి రాజశేఖర్‌(Rajasekhar)పై సీబీఐ కేసు(CBI Case) నమోదు అయింది. ఆదాయానికి మించిన ఆస్తులు ఆర్జించారని.. అవినీతి చట్టం కింద మంగళవారం అధికారులు కేసు నమోదు చేశారు. రాజశేఖర్‌తో పాటు ఆయన భార్య నవనీతను కూడా నిందితురాలిగా పేర్కొన్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్ డివిజన్ కార్యాలయంలో రాజశేఖర్‌ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నారు. రాజశేఖర్ దంపతులు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం లేదనీ సీబీఐ అధికారులు గుర్తించారు. సీబీఐ కేసు, అక్రమాస్తులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story