హిడెన్ కెమెరాతో పద్మనాభస్వామి ఆలయంలోకి.. యాత్రికుడిపై కేసు నమోదు

by Kema Shiva Kumar |

దేశంలోనే ప్రసిద్ధి పొందిన కేరళ రాష్ట్రం తిరువనంతపురం జిల్లాలోని శ్రీ పద్మనాభస్వామి ఆయలం (Sri Padmanabhan Swamy Temple) లోకి ఓ భక్తుడు రహస్య కెమెరాను ధరించి వెళ్లిన ఘటన కలకలం సృష్టిస్తోంది.

హిడెన్ కెమెరాతో పద్మనాభస్వామి ఆలయంలోకి.. యాత్రికుడిపై కేసు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలోనే ప్రసిద్ధి పొందిన కేరళ రాష్ట్రం తిరువనంతపురం జిల్లాలోని శ్రీ పద్మనాభస్వామి ఆయలం (Sri Padmanabhan Swamy Temple) లోకి ఓ భక్తుడు రహస్య కెమెరాను ధరించి వెళ్లిన ఘటన కలకలం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌ రాష్ట్రానికి చెందిన 66 ఏళ్ల యాత్రికుడు సురేంద్ర షా (Surendra Shah) తన భార్య, సోదరి, కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం పద్మనాభస్వామి దేవాలయంలోకి హిడెన్ కెమెరాలతో కూడిన స్మార్ట్ గ్లాసెస్ పెట్టుకుని వెళ్లాడు. ఈ క్రమంలోనే అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది సురేంద్ర షా పెట్టుకున్న స్మార్ట్ గ్లాసెస్ నుంచి లైట్ రావడాన్ని గమనించారు. దీంతో ఆయన అదుపులోకి తీసుకుని ఆ స్మార్ట్ గ్లాసెస్‌ను చెక్ చేయగా అందులో హిడెన్ కెమెరా బయటపడింది. ఆలయంలో వీడియో రికార్డింగ్ చేయడం చట్టరీత్యా నేరం కావడంతో భద్రతా సిబ్బంది సురేంద్ర షాపై బీఎన్ఎస్-223 (ప్రభుత్వ ఉద్యోగుల చట్టబద్ధ ఆదేశాలను అమాన్యం చేయడం)కింద కేసు నమోదు చేశారు, విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. అదేవిధంగా అతడిని తిరిగి గుజరాత్‌ వెళ్లేందుకు కుటుంబంతో అనుమతించలేదు.

Next Story