TG: ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం అడుగుతున్నారా?.. అయితే ఈ అస్త్రం వాడండి!

by Gantepaka Srikanth |   (  Updated:2025-07-26 14:33:31  IST  )

మరో అవినీతి తిమింగలాన్ని ఏసీబీ(ACB) అధికారులు పట్టుకున్నారు.

TG: ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం అడుగుతున్నారా?.. అయితే ఈ అస్త్రం వాడండి!
X

దిశ, వెబ్‌డెస్క్: మరో అవినీతి తిమింగలాన్ని ఏసీబీ(ACB) అధికారులు పట్టుకున్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని ఇన్ముల్నర్వ గ్రామ పంచాయతీ కార్యదర్శి(Panchayat Secretary) కే.సురేందర్‌పై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. ఇంటి నిర్మాణానికి అనుమతి కోసం ఓ వ్యక్తి పంచాయతీ కార్యదర్శి సురేందర్‌ను వద్దకు వచ్చారు. దీంతో రూ.లక్ష లంచం(Bribe) ఇవ్వాలని డిమాండ్ చేశారు. చేసేదేం లేక బాధితుడు ముందస్తుగా రూ.50 వేలు ఇచ్చాడు. మిగతా రూ.50 ఇచ్చేముందు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. శనివారం మిగిలిన రూ.50 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఎంట్రీ ఇచ్చారు. వారిని గమనించిన పంచాయతీ సెక్రటరీ అక్కడి నుంచి పరారయ్యాడు. ప్రస్తుతం అతని కోసం పోలీసుల సాయంతో ఏసీబీ అధికారులు గాలిస్తున్నారు. ఇలా ఎవరైనా లంచం ఇవ్వాలని డిమాండ్ చేస్తే.. ఏసీబీ సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు లేదా.. 9440446106 నెంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. ఏసీబీ పోస్టు

Next Story