- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాంపల్లి బచ్చస్ ఫర్నిచర్ యజమానిపై కేసు నమోదు
నాంపల్లి బచ్చాస్ ఫర్నిచర్ షాపు యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. షర్నిచర్ షాప్ లో శనివారం మద్యాహ్నం అగ్నిప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: నాంపల్లి బచ్చాస్ ఫర్నిచర్ షాపు యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. షర్నిచర్ షాప్ లో శనివారం మద్యాహ్నం అగ్నిప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఆ మంటలు ఆరలేదు. భవనంలో ఆరుగురు చిక్కుకుపోగా వారిలో ఇద్దరు చిన్నారులు సైతం ఉన్నారు. మంటలు ఆర్పేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది 18గంటలుగా శ్రమిస్తున్నారు. ప్రణాలకు తెగించి రెస్క్యూ సిబ్బంది ప్రయత్నించినా మంటలు అదుపులోకి రావడంలేదు. మరోవైపు భవనం దృఢత్వంపైనా అధికారులకు అనుమానం రావడంతో జేఎన్టీయూ ఇంజినీరింగ్ నిపుణుల బృందానికి సైతం సమాచారం ఇచ్చారు. భవానాన్ని తనిఖీ చేసి నివేదిక ఇవ్వనున్నారు. ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే హైదరాబాద్ సీపీ సజ్జనార్, కలెక్టర్ చందనాదీప్తి ఆ ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలను పరిశీలించారు. స్థానిక నాయకులు, ఎమ్మెల్యేలు సైతం ఘటనాస్థలానికి చేరుకుంటున్నారు.






