NIMS డిప్యూటీ సూపరిండెంట్‌పై కేసు నమోదు

by Gantepaka Srikanth |

నిమ్స్(NIMS) డిప్యూటీ సూపరిండెంట్‌ లక్ష్మీ భాస్కర్‌(Lakshmi Bhaskar)పై కేసు నమోదు అయింది.

NIMS డిప్యూటీ సూపరిండెంట్‌పై కేసు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: నిమ్స్(NIMS) డిప్యూటీ సూపరిండెంట్‌ లక్ష్మీ భాస్కర్‌(Lakshmi Bhaskar)పై కేసు నమోదు అయింది. రాజమండ్రికి చెందిన మరో వైద్యుడిని స్థలం వివాదంలో మోసం లక్ష్మీ భాస్కర్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. స్థలం(Land Issue) పేరుతో రూ.50 లక్షలు కాజేసినట్లు నిర్ధారించారు. అయితే దీనిపై గత ఏప్రిల్‌లో బంజారాహిల్స్ పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో సోమవారం బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. లక్ష్మీ భాస్కర్‌పై గతంలోనూ ఇదే తరహా ఆరోపణలు వచ్చాయి. తనకు గత ప్రభుత్వ రాజకీయ నేతల పలుకుబడి ఉందని.. వారి అండతోనే తమను మోసం చేశారని బాధితులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. లక్ష్మీ భాస్కర్‌తో పాటు ఆమెకు సహకరించిన మరికొందరిపైనా బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Next Story