థియేటర్ వద్ద బాలయ్య ఫ్యాన్స్ అరాచకం.. BIG షాకిచ్చిన పోలీసులు

by Gantepaka Srikanth |

టసింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ప్రధాన పాత్రలో నటించిన డాకు మహారాజ్ చిత్రం(Daaku Maharaaj Movie) బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది.

థియేటర్ వద్ద బాలయ్య ఫ్యాన్స్ అరాచకం.. BIG షాకిచ్చిన పోలీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: నటసింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ప్రధాన పాత్రలో నటించిన డాకు మహారాజ్ చిత్రం(Daaku Maharaaj Movie) బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. రూ.100 కోట్ల మార్క్‌ను దాటి భారీ కలెక్షన్ల దిశగా దూసుకుపోతోంది. బాబీ కొల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి తమన్(Thaman S) సంగీతం అందించారు. అయితే.. సినిమా విడుదల సందర్భంగా ఓ థియేటర్ వద్ద బాలయ్య ఫ్యాన్స్‌(Balayya Fans) ఓవరాక్షన్ చేసిన విషయం తెలిసిందే. థియేటర్ వద్ద గొర్రె పొట్టేలును బలి ఇచ్చారు. ఆ మూగ జీవాన్ని బలి ఇచ్చి దాని రక్తాని డాకు మహారాజ్ పోస్టర్‌కు రుద్దుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సినిమా హిట్ కావాలని మూగ జీవాలను అలా బలివ్వడం ఏంటని జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ ఘటనపై తిరుపతిలో కేసు నమోదైంది. పొట్టేలును బలిచ్చిన ఐదుగురిపై తిరుపతి పోలీసులు(Tirupati Police) కేసు నమోదు చేశారు. నిందితులు శంకరయ్య, రమేష్, సురేష్ రెడ్డి, ప్రసాద్, లోకేష్ బాబుగా ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఇక సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. తొలిరోజు ఈ చిత్రం రూ.56 కోట్లు వసూళ్లు చేసింది. బాలకృష్ణ కెరీర్‌లోనే తొలిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా డాకు మహారాజ్ నిలిచింది.

Next Story