- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Case file : గాంధీ విగ్రహం నోట్లో టపాసులు.. సోషల్ మీడియాలో పోస్ట్
సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేయడానికి మైనర్ బాలుర్లు గాంధీ విగ్రహం నోటిలో టపాసులు పేల్చారు.

దిశ, మేడ్చల్ బ్యూరో : సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేయడానికి మైనర్ బాలుర్లు గాంధీ విగ్రహం నోటిలో టపాసులు పేల్చారు. దాంతో బోయినపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ రెడ్డి తెలిపిన వివరాల మేరకు బోయినపల్లి బాపూజీ నగర్ లో నలుగురు మైనర్ బాలుర్లు శనివారం తమ బంధువులకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్నారు.
సోషల్ మీడియాలో వివర్ షిప్ కోసం బాపూజీ నగర్ బస్తీలో ఉన్న గాంధీ విగ్రహం వద్దకు చేరారు. దీపావళి పండుగ నేపథ్యంలో కొత్తగా ఏదైనా రీల్స్ చేయాలని టపాసులు తీసుకొని గాంధీ విగ్రహం నోటిలో పెట్టి పేల్చారు. ఈ తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోను కొందరు పోలీస్ వారికి ట్యాగ్ చేశారు. స్నాప్ చాట్ లో వచ్చిన వీడియోలు ఆధారంగా బోయినపల్లి పోలీసులు దర్యాప్తు చేసి మైనర్ బాలుర్లను గుర్తించి పోలీస్ స్టేషన్కు తరలించారు.






