- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌లో కార్ రేసర్ల బీభత్సం.. సినిమా రేంజ్‌లో చేజ్ చేసి పట్టుకున్న పోలీసులు
హైదరాబాద్ లో కార్ రేసర్లు రెచ్చిపోతున్నారు. శనివారం రాత్రి రాయదుర్గం పరిధిలో కార్లు, బైకులతో రేసింగ్ చేశారు. ఈ క్రమంలో పోలీసుల కంటపడటంతో వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా పోలీసులపైకే దూసుకువచ్చారు.

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ లో కార్ రేసర్లు రెచ్చిపోతున్నారు. శనివారం రాత్రి రాయదుర్గం పరిధిలో కార్లు, బైకులతో రేసింగ్ చేశారు. ఈ క్రమంలో పోలీసుల కంటపడటంతో వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా పోలీసులపైకే దూసుకువచ్చారు. దీంతో సహనం నశించి పోలీసులు కారు అద్దాలను ధ్వంసం చేశారు. పోకిరీలను అదుపులోకి తీసుకుని కారును స్టేషన్ కు తరలించారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో కొంతమంది యవకులు ఉండగా మరికొందరు అక్కడ నుండి పారిపోయారు. పట్టుబడిన యువకులపై కేసులు నమోదు చేసి కార్లను స్టేషన్ కు తరలించారు. గతంలోనూ అనేకసార్లు హైటెక్ సిటీలో యువకులు కార్లు, బైక్ రేసింగ్‌కు పాల్పడుతూ పోలీసులకు పట్టుబడ్డారు. పలుమార్లు హెచ్చరించినా వారి తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చినా యువకుల తీరులో మార్పు మాత్రం రావడంలేదు. ముఖ్యంగా వీకెండ్స్ లో శనిఆదివారాల్లో యువకులు రేసింగ్ కు పాల్పడుతున్నారు. ఇందులో పాల్గొనేందుకు హైదరాబాద్ నలుమూలల నుండి వచ్చేస్తున్నారు. దీంతో అటువైపు వెళ్లాలంటే వాహనదారులు, ప్రజలు భయపడిపోతున్నారు.






