లోయలో పడిపోయిన కారు.. ముగ్గురు మృతి

by Malleboina Mahesh |

పర్వత ప్రాంతాల్లో వెళ్తున్న కారు.. అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ విషాద సంఘటన హిమాచల్ ప్రదేశ్ లోని చంబా జిల్లాలో చోటు చేసుకుంది.

లోయలో పడిపోయిన కారు.. ముగ్గురు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: పర్వత ప్రాంతాల్లో వెళ్తున్న కారు.. అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ విషాద సంఘటన హిమాచల్ ప్రదేశ్ లోని చంబా జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చంబా జిల్లాలోని చురా అసెంబ్లీలో 200 మీటర్ల లోతైన లోయలో కారు పడిపోవడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు గురువారం తెలిపారు. దేవికోటి-టెపా రోడ్డులో జరిగిన ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్నవారు వివాహ కార్యక్రమం నుంచి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. మృతులను రాజిందర్ కుమార్ (డ్రైవర్), పుమ్మీ కుమార్, సచిన్‌గా గుర్తించారు. గాయపడిన ఇద్దరు అమర్ సింగ్, ధరమ్ సింగ్‌లను టిస్సాలోని సివిల్ హాస్పిటల్ నుండి చంబాలోని మెడికల్ కాలేజీకి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Next Story