- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కారు బైకు ఢీ.. డీసీఎం కింద పడిన వ్యక్తి పరిస్తితి విషమం
దిశ, బిజినేపల్లి : కారు- బైకు ఢీ కొనడం.. ఆ తరువాత డీసీఎంకింద పడి వ్యక్తి మృతి చెందిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల పరిధిలోని వెంకటాపూర్ గ్రామం సమీపంలో చోటు చేసుకుంది.

దిశ, బిజినేపల్లి : కారు- బైకు ఢీ కొనడం.. ఆ తరువాత డీసీఎం కింద పడి వ్యక్తి తీవ్రంగా ఘటన నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల పరిధిలోని వెంకటాపూర్ గ్రామం సమీపంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బిజినేపల్లి మండలం వడ్డేమాన్ గ్రామానికి చెందిన మండల శ్రీనివాసులు(45) నాగర్ కర్నూల్ నుంచి బైకు పై వడ్డేమాన్ కు వస్తున్నాడు. వెంకటాపూర్ గ్రామ సమీపంలో పాలెం పాలిటెక్నిక్ కళాశాల ముందుకు రాగానే బైకు బలంగా కారును ఢీ కొట్టింది. దీంతో బైకు పై ఉన్న శ్రీనివాసులు నడిరోడ్డుపై ఎగిరిపడ్డాడు. దీంతో వెనుకాల వేగంగా వస్తున్న డీసీఎం తొడలపై పోవడంతో శ్రీనివాసులు కి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి చాలా విషమంగా ఉంది. భార్యతో పాటు ముగ్గురు సంతానం కలరు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు.






