పుట్టినరోజు విషాదం.. కారు ప్రమాదంలో ముగ్గురు స్నేహితుల దుర్మరణం..

by Sujitha Rachapalli |

ఉత్తరప్రదేశ్ బదాయూన్‌లో విషాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న కారు స్తంభానికి ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు స్నేహితులు చనిపోయారు. ఏఆర్టీఓ కార్యాలయం దగ్గర్లో ఈ ప్రమాదం జరగగా..

పుట్టినరోజు విషాదం.. కారు ప్రమాదంలో ముగ్గురు స్నేహితుల దుర్మరణం..
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ బదాయూన్‌లో పుట్టినరోజున విషాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న కారు స్తంభానికి ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు స్నేహితులు చనిపోయారు. ఏఆర్టీఓ కార్యాలయం దగ్గర్లో ఈ ప్రమాదం జరగగా.. హర్షిత్ సక్సేనా, రూబల్ గుప్తా, హర్షిత్ గుప్తా అక్కడికక్కడే మరణించారు. అంకిత్ తీవ్ర గాయాలతో చికిత్స కోసం తరలించబడ్డాడు. కాగా లేఖ్పాల్ రెవెన్యూ అధికారి అయిన హర్షిత్ సక్సేనా బర్త్ డే సందర్భంగా తన స్నేహితులకు పార్టీ ఇచ్చేందుకు తీసుకెళ్లాడు. దాబాలో భోజనం చేసి తిరిగి వస్తుండగా.. ఈ దారుణం జరిగింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు.. ఇందుకుగల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.


Next Story