- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బెట్టింగ్ యాప్స్‌లో రూ.2 కోట్లు పోగొట్టుకుని దొంగగా మారిన వ్యాపారి.. చివరికి
బెట్టింగ్ యాప్స్ మాయలో పడిన ఓ వ్యాపారం కోట్లు పోగొట్టుకుని చివరికి దొంగగా మారాడు. చివరికి పోలీసులకు దొరికిపోవడంతో అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. నారాయణపేట జిల్లా కోస్గి హన్మాన్ పల్లికి చెందిన వెంకట్ నాయక్ అనే వ్యక్తికి భార్య కుమారుడు, కుమార్తె ఉన్నారు.

దిశ, వెబ్ డెస్క్: బెట్టింగ్ యాప్స్ మాయలో పడిన ఓ వ్యాపారం కోట్లు పోగొట్టుకుని చివరికి దొంగగా మారాడు. చివరికి పోలీసులకు దొరికిపోవడంతో అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. నారాయణపేట జిల్లా కోస్గి హన్మాన్ పల్లికి చెందిన వెంకట్ నాయక్ అనే వ్యక్తికి భార్య కుమారుడు, కుమార్తె ఉన్నారు. వెంకట్ నాయక్ డ్రిప్ ఇరిగేషన్ పైపుల తయారీ యూనిట్ నిర్వహించేవాడు. కాగా వెంకట్ నాయక్ కు వ్యాపారంలో నష్టాలు రావడంతో ఆన్ లైన్ గేమింగ్ కు అలవాటుపడ్డాడు. ఈ క్రమంలో గేమ్స్ ఆడుతూ తన వద్ద ఉన్న డబ్బుతో పాటు తన మేనమామ, స్నేహితుడు, సోదరుడి కార్లను సైతం తాకట్టు పెట్టి డబ్బులు పోగొట్టుకున్నాడు.
రెండేళ్లలో దాదాపు రూ.2 కోట్లు పోగొట్టుకోగా ఒక నెలలోనే రూ.30 లక్షలు పోగొట్టుకున్నాడు. చివరికి అప్పుల బాధతో ఈనెల 15న రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకోగా కుటుంబం గుర్తుకు వచ్చి ఆగిపోయాడు. దొంగతనం చేసైనా అప్పులు తీర్చాలని నిర్ణయించుకుని లింగపల్లి ట్రైన్ ఎక్కి ఓ ప్రయాణికురాలి మెడలో ఆభరణాలు దొంగలించాడు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన రైల్వే పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పట్టుకున్నారు.






