అంబులెన్స్‌ను ఢీకొట్టిన బస్సు.. అక్కడికక్కడే ఇద్దరు దుర్మరణం

by Kema Shiva Kumar |

ఆదిలాబాద్‌లో రోగితో వెళ్తున్న అంబులెన్స్‌ను బస్సు ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు స్పాట్‌లోనే మృతి చెందారు.

అంబులెన్స్‌ను ఢీకొట్టిన బస్సు.. అక్కడికక్కడే ఇద్దరు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన ఘటన కామారెడ్డి (Kamareddy) జిల్లా భిక్కనూరు మండల పరిధిలోని రామేశ్వర్‌పల్లి వద్ద ఇవాళ ఉదయం చోటుచేసుకుంది. ఆదిలాబాద్‌ (Adilabad)కు రోగితో వెళ్తున్న అంబులెన్స్‌ను ఎదురుగా వస్తున్న బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఢీకొన్న వేగానికి అంబులెన్స్ తీవ్రంగా దెబ్బతింది. ఈ ప్రమాదంలో అంబులెన్స్‌లో ఉన్న రోగి సలేహ భాను (63), అంబులెన్స్ డ్రైవర్ సైఫుల్లా ఖాన్ (76) తీవ్ర గాయాలకు గురై ఘటనా స్థలంలోనే మృతి చెందారు.

ప్రమాదం జరిగిన వెంటనే గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న వారు స్పాట్‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది.. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం ఉందా? అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఆసుపత్రికి వెళ్లే క్రమంలోనే ప్రాణాలు కోల్పోవడంతో బాధితుల కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది.

Next Story