ఏపీలో మరో బస్సు ప్రమాదం

by Ajay Maddhiboyina |   (  Updated:2025-11-27 08:06:04  IST  )

తెలుగు రాష్ట్రాల్లో బస్సు ప్రమాద ఘటనలు ఆందోళన పెట్టిస్తున్నాయి. తరచూ ఎక్కడో చోట ప్రైవేటు, ఆర్టీసీ బస్సులు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఏపీలోని అనంతపూర్ లో మొదట ప్రైవేటు ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురై 19మంది ప్రయాణికులు సజీవదహనం అయిన సంగతి తెలిసిందే.

ఏపీలో మరో బస్సు ప్రమాదం
X

దిశ‌, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో బస్సు ప్రమాద ఘటనలు ఆందోళన పెట్టిస్తున్నాయి. తరచూ ఎక్కడో చోట ప్రైవేటు, ఆర్టీసీ బస్సులు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఏపీలోని అనంతపూర్ లో మొదట ప్రైవేటు ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురై 19మంది ప్రయాణికులు సజీవదహనం అయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం తరవాత ఇటీవలే తిరుపతిలో మరో బస్సు ప్రమాదం జరిగింది.

మరోవైపు మూడు రోజుల క్రితమే కర్నూలులో మరో బస్సు ప్రమాదానికి గురైంది. ఇక ఇప్పుడు తాజాగా అనంతపురంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సు ఆర్టీసీ బస్సును ఓవర్ టెక్ చేసే సమయంలో అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ఘటనలో రెండు బస్సులు దెబ్బతిన్నాయి. ప్రైవేటు బస్సు ఎస్ఆర్‌జే ట్రావెల్స్ కు చెందినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో రెండు బస్సుల్లోని ప్రయాణికులకు గాయాలయ్యాయి.

Next Story