- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాలిక శవంతోనే లేచిన మంత్రగాడి మృతదేహం
క్షుద్రపూజలు చేసి బాలిక మృతికి కారణమయ్యాడనే అనుమానంతో విచక్షణ కోల్పోయారు కొందరు వ్యక్తులు.

దిశ, ఆళ్లపల్లి : క్షుద్రపూజలు చేసి బాలిక మృతికి కారణమయ్యాడనే అనుమానంతో విచక్షణ కోల్పోయారు కొందరు వ్యక్తులు. బాలికకు మంత్రాలు చేసిన మంత్రగాడు ఊర్లో ఉండకూడదని ఆరుగురు వ్యక్తులు కలిసి విరుచుకుపడ్డారు. బాలిక మృతదేహంతోనే మంత్రగాడు పోవాలని అతడిపై మూకుమ్మడిగా కర్రలతో దాడి చేసి ప్రాణం తీశారు. పోలీసులకు సమాచారం అందినా సరైన రోడ్డు సౌకర్యం లేక అతడి ప్రాణాలు కాపాడలేకపోయారు. ఖమ్మం జిల్లాలో జరిగిన ఈ దుశ్చర్యకు సంబంధించిన వివరాలను పోలీసులకు వెల్లడించారు. వారి కథనం ప్రకారం..
అసలేం జరిగిందంటే..
ఆళ్లపల్లి మండలం, పెద్ద వెంకటాపురం గ్రామపంచాయతీ పరిధిలోని భూసరాయి గ్రామానికి చెందిన గంగి అనే బాలిక గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం రాత్రి మృతి చెందింది. అయితే బీడ రాజు (35) మంత్రాలు చేయడంతోనే బాలిక చనిపోయిందని గ్రామానికి చెందిన మడవి రాజు, మొక్కటి చిన్న సోమయ్య, మొక్కటి భీమయ్య, వజ్జం గంగ, వేకో జోగా, ఒక్కటి వెంకటేశ్వర్లు అనుమానించారు. అంతేకాక ఈ రోజు (గురువారం) ఉదయం బీడ రాజును బాలిక మృతదేహం వద్దకు లాక్కెళ్లి కట్టెలతో మూకుమ్మడిగా దాడి చేశారు. వారి దాడిలో తీవ్రంగా గాయపడిన బీద రాజు అక్కడికక్కడే ప్రాణాల విడిచాడు.
రోడ్డు ఉంటే ప్రాణాలు దక్కేవి..
బీద రాజుపై గ్రామస్తులు దాడి చేస్తున్న సమయంలో పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అలర్ట్ అయిన సీఐ సత్యనారాయణ, ఎస్ఐ సోమేశ్వర్ సిబ్బందితో కలిసి హూటాహుటిన భూసరాయి గ్రామానికి బయలుదేరారు. కానీ గ్రామానికి సరైన రహదారి లేకపోవడంతో సింగారం గ్రామం వద్ద ద్విచక్ర వాహనాలు నిలిపివేయాల్సి వచ్చింది. అక్కడి నుంచి సుమారు 10 కిలోమీటర్లు కాలినడకన గుట్టలు దాటుకొని ఆ గ్రామానికి చేరుకున్నారు. కానీ అప్పటికే బీద రాజు ప్రాణాలు విడిచాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని కర్రలకు కట్టుకొని గుట్టలపై నుంచి రాళ్ల బాటన పోస్టుమార్టానికి తరలించారు. కాగా, దాడికి పాల్పడిన ఆరుగురు నిందితులు పోలీసులు వచ్చే లోపే పరారీ అయ్యారు. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టినట్టు సీఐ సత్యనారాయణ తెలిపారు. గ్రామానికి రోడ్డు సౌకర్యం ఉంటే పోలీసులు సకాలంలో వచ్చే ఉండేవారిని, గ్రామంలో హత్య జరిగి ఉండేది కాదని గ్రామస్తులు ఆవేదన చెందారు.






