- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Brutal Murder: తెలంగాణలో సంచలనం.. మహిళ దారుణ హత్య
మహిళ దారుణ హత్యకు గురైన భయానక ఘటన నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్/నందిపేట్: మహిళ దారుణ హత్యకు గురైన భయానక ఘటన నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నందిపేట మండలం షాపూర్ గ్రామానికి చెందిన సాదా సుమలత (38) సంవత్సరాలు సోమవారం సంతకు కూరగాయలు తీసుకురావడానికి అని వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కంగారు పడిన కుటుంబ సభ్యులు నందిపేట పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సుమలత జాడ కోసం గాలిస్తుండగా.. ఐలాపూర్ గ్రామ శివారులోని గుత్ప కెనాల్ పక్కన సుమలత హత్యకు గురైనట్లుగా సమాచారం అందిందని ఎస్సై చిరంజీవి తెలిపారు. గుర్తు తెలియని దుండగులు మద్యం తాగి మత్తులో సుమలతపై అత్యాచారం చేసి హతమార్చినట్లుగా గుర్తించామని అన్నారు. ఘటనా స్థలం వద్ద మద్యం సీసాలు, గ్లాసులతో పాటు మృతురాలి కూరగాయల సంచి చిందరవందరగా పడి ఉన్నాయని పేర్కొన్నారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నట్లుగా ఎస్సై చిరంజీవి తెలిపారు.






