- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Brutal Murder: ఉలిక్కిపడిన ఓల్డ్ సిటీ.. వ్యక్తి దారుణ హత్య
by Kema Shiva Kumar |
ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన నగరంలోని ఓల్డ్ సిటీ (Old City) పరిధిలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన నగరంలోని ఓల్డ్ సిటీ (Old City) పరిధిలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చోటాపూర్ (Chotapur) సమీపంలో జునైద్ (30) అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో అతి కిరాతకంగా దాడి చేసి హతమార్చారు. అనంతరం వారు అక్కడి నుంచి పరారయ్యారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లావాదేవీల కారణంగా జునైద్‌ను ప్రత్యర్థులు హత్య చేసినట్లుగా ప్రాథమిక విచారణలో తేలింది. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను (Special Teams) ఏర్పాటు చేసి తీవ్రంగా గాలిస్తున్నారు.
Next Story






