- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోకలి బండతో బాది మహిళా దారుణ హత్య
దిశ, వెల్గటూర్ : స్తంభంపల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. లివింగ్ రిలేషన్ షిప్ లో ఒక్కటై కొంత కాలంగా జీవిస్తున్న వారి మధ్య నెలకొన్న బేధాభిప్రాయాల వల్ల ఉన్నట్టుండి

దిశ, వెల్గటూర్ : స్తంభంపల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. లివింగ్ రిలేషన్ షిప్ లో ఒక్కటై కొంత కాలంగా జీవిస్తున్న వారి మధ్య నెలకొన్న బేధాభిప్రాయాల వల్ల ఉన్నట్టుండి ఒక్క సారిగా కోపోద్రిక్తుడైన వ్యక్తి తనతో కలిసి కొంతకాలంగా జీవనం సాగిస్తున్న మహిళను రోకలిబండతో తలపై దారుణంగా మోది హత్య చేసిన ఉదంతం సంచలనం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం స్తంబంపల్లి గ్రామానికీ చెందిన మండల నరేష్ తనతో సహజీవనం చేస్తున్న అలివేలు అనే మహిళను రోకలి బండతో తలపై దారుణంగా కొట్టి మంగళవారం హత్య చేశారు. ధర్మపురి సీఐ రాం నరసింహా రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. స్తంభంపల్లి గ్రామానికి చెందిన మండల నరేష్ జీవితమే నేరాలతో ముడిపడి ఉంది. గతంలో ఇతనికి వివాహం అయింది. పిల్లలు కూడా ఉన్నారు.
మంచిర్యాల ప్రాంతంలో కొన్నేళ్ల క్రితం ఓ దోపిడీ హత్య కేసులో ఇతడు జైలుకి వెల్లాడు. అప్పుటి నుంచి ఇతనితో మొదటి.భార్య దూరంగా ఉంటున్నట్లు తెలి సింది. ఇతడు చేసిన హత్యలో ప్రస్తుతం సహా జీవనం చేస్తున్న మృతురాలికి కూడా సంబంధం ఉన్నట్లు సమాచారం. అయితే అప్పటి నుంచే అలివేలు తో నరేష్ సహా జీవనం చేస్తున్నట్లు సమాచారం. అలివేలు హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో నర్స్ గా పని చేస్తున్నట్లు గా తెలుస్తోంది. మృతురాలు కు పిల్లలు ఉన్నట్లు సమాచారం. నరేష్ స్వగ్రామం అయిన స్తంభం పల్లి లోని ఇంటికి సాయంత్రం వరకు ఒకరి తర్వాత ఒకరు ఇద్దరు చేరుకొన్నారు. వచ్చిన కొద్ది సేపటికే ఇంటిలో ఇద్దరు గొడవ పడ్డారు. ఒకరి పై ఒకరు అరుచుకున్నారు. ఈ నేపథ్యంలో తీవ్రంగా కోపోద్రిక్తుడైన నరేష్ అలివేలు పై రోకలి బండ తో దాడి చేసి కొట్టి చంపాడు. ఈ దాడిలో ఆమె తల పగిలి తీవ్ర రక్త స్రావం జరిగి అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ రాం నర్సింహారెడ్డి హత్యకు ఉపయోగించిన రోకలి బందను స్వాధీనం చేసుకొని ఎస్సై లు ఉదయ్ కుమార్ కృష్ణ సాగర్రెడ్డి, మహేష్ లతో కలిసి విచారణ ప్రారంభించారు.






