రంగారెడ్డి జిల్లాలో యువకుడి దారుణహత్య

by Naga Rani Yarlagadda |

హైదరాబాద్ నగర శివార్లలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.

రంగారెడ్డి జిల్లాలో యువకుడి దారుణహత్య
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగర శివార్లలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు యువకుడి గొంతుకోసి దారుణంగా హతమార్చారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కవేలిగూడ వద్ద మొయినాబాద్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన మహేష్ (26) అనే యువకుడిని హత్య చేశారు. నిందితులు ఎవరన్న విషయం ప్రశ్నార్థకంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మహేష్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. వివాహేతర సంబంధమే మహేష్ హత్యకు కారణమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య జరిగిన ప్రాంతానికి సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

Next Story