- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అక్రమ సంబంధమే యువకుడి హత్యకు కారణమా
by Batti.Sumithra |
ఆదిలాబాద్ పట్టణంలో తెల్లవారుజామున ఓ యువకుడు హత్యకు గురైన ఘటన కలకలం రేపింది.

X
దిశ, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ పట్టణంలో తెల్లవారుజామున ఓ యువకుడు హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే ఆదిలాబాద్ పట్టణంలోని శాంతినగర్‌లో నివాసం ఉండే మహమ్మద్ అర్బాజ్ (25)ను ముగ్గురు వ్యక్తులు తెల్లవారుజామున తరుముతూ కర్రలతో దాడి చేయగా, అతను అక్కడికక్కడే మృతి చెందాడు.
సమాచారం తెలుసుకున్న డీఎస్పీ జీవన్ రెడ్డి, సీఐ సునీల్ కుమార్ ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అక్రమ సంబంధమే ఈ హత్యకు దారితీసి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






