- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పద్మారావు నగర్ లో వ్యక్తి దారుణ హత్య..!
పద్మారావు నగర్ లో దారుణ హత్య చోటుచేసుకుంది. జమీష్టాన్ పూర్ కి చెందిన అలీమ్ (42) ఏసీ రిపేర్ మెకానిక్ గా పని చేస్తుంటాడు.

దిశ, సీతాఫలమండి : పద్మారావు నగర్ లో దారుణ హత్య చోటుచేసుకుంది. జమీష్టాన్ పూర్ కి చెందిన అలీమ్ (42) ఏసీ మెకానిక్ గా పని చేస్తుంటాడు. అయితే అలీమ్ ను ఇద్దరు వ్యక్తులు కత్తితో దాడి చేసి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం సాయంత్రం పద్మారావునగర్-చిలకలగూడలోని కేవీకే వైన్స్ వద్ద మృతుడు అలీమ్.. నిందితులు సయ్యద్ ఇల్యాస్(33), జహంగీర్ కలిసి మద్యం సేవించారు. బయటికి వచ్చిన తరువాత వారిలో ఆర్థిక వివాదం పై వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ గొడవ తీవ్రరూపం దాల్చడంతో సయ్యద్ ఇల్యాస్, జహంగీర్ కత్తితో అలీమ్ పై దాడి చేశారు. ఈ దాడిలో తీవ్ర గాయాలైన అలీమ్ అక్కడికక్కడే మృతి చెందినట్టు సమాచారం.
ఆర్థిక వివాదమే కారణం
మృతుడికి.. నిందితులకు జూదం ఆడే అలవాటు ఉంది. అలీమ్.. జహంగీర్ కి అప్పుగా తీసుకున్న డబ్బు చెల్లించకపోవడంతో గురువారం వివాదం తెలెత్తినట్టు భావిస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం సయ్యద్ ఇల్యాస్ పోలీసుల అదుపులో ఉన్నాడు. మరో నిందితుడు జహంగీర్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్టు చిలకలగూడ సీఐ రామకృష్ణ తెలిపారు.






