Brutal Murder: రాష్ట్రంలో మరో ఘోరం.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దారుణ హత్య

by Kema Shiva Kumar |

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ (Software Engineer) దారుణ హత్యకు గురైన విషాద ఘటన విజయనగరం (Vizianagaram) జిల్లా తెర్లాం (Terlam) మండల పరిధిలోని నెమలాం (Nemalam) గ్రామంలో చోటుచేసుకుంది.

Brutal Murder: రాష్ట్రంలో మరో ఘోరం.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దారుణ హత్య
X

దిశ, వెబ్‌డెస్క్: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ (Software Engineer) దారుణ హత్యకు గురైన విషాద ఘటన విజయనగరం (Vizianagaram) జిల్లా తెర్లాం (Terlam) మండల పరిధిలోని నెమలాం (Nemalam) గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన కొనారి హరిప్రసాద్ (Konari Hari Prasad) (28) బెంగళూరు (Bengaluru)లోని ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే, ఓ పనిపై మూడు రోజుల క్రితం అతడు స్వగ్రామం నెమలాం (Nemalam)కు వచ్చాడు. సోమవారం రాత్రి తన బైక్‌పై తాత గారి ఊరు బూరిపేట (Buripeta) నుంచి నెమలాం వస్తుండగా గుర్తు తెలియని కొందరు వ్యక్తులు అతడిపై విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు.

ఈ దాడిలో హరిప్రసాద్‌ తలపై గాయం కాగా తీవ్ర రక్తస్రావంతో అతడు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. అనంతరం ఆగంతకులు అతడి మృతదేహాన్ని నడిరోడ్డుపై పడేసి అక్కడి నుంచి పరార్ అయ్యారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. హరి ప్రసాద్ (Hari Prasad) శరీరంపై బలమైన దెబ్బలు తగిలిన ఆనవాళ్లు ఉBrutal Murder: రాష్ట్రంలో మరో ఘోరం.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దారుణ హత్యన్నాయని వెల్లడించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు.

Next Story