- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Brutal Murder: తెలంగాణలో మరో సంచలనం.. పట్టపగలే మహిళ దారుణ హత్య
తెలంగాణ (Telangana) రాష్ట్రంలో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్/గజ్వేల్ రూరల్: తెలంగాణ (Telangana) రాష్ట్రంలో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. గజ్వేల్ మండల పరిధిలోని రిమ్మనగూడలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. అడ్డుకోబోయిన భర్తను కూడా తీవ్రంగా గాయపరిచిన దుండగులు పరారయ్యారు. రిమ్మనగూడ సమీపంలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్ వద్ద సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళితే హైదరాబాద్‌కు చెందిన సాదక్ తన భార్య ఆస్రా బేగంతో కలిసి గత కొంతకాలంగా రిమ్మనగూడ హెచ్ పీ పెట్రోల్ పంపు వద్ద సెక్యూరిటీ సిబ్బందిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం ఉదయం సొంత పని నిమిత్తం ఆస్రా హైదరాబాద్‌కు వెళ్లిందని ఒక్కతే వెళ్లిన ఆస్రా బేగం తిరుగు ప్రయాణంలో రాత్రికి మరో వ్యక్తితో కలిసి రిమ్మనగూడకు వచ్చిందని అన్నారు. ఏదో విషయంలో రాత్రి పొద్దుపోయాక తెల్లవారుజామున వారిద్దరు గొడవపడ్డారని, దీంతో అతడు పారతో, కట్టెతో ఆస్రా బేగం ముఖంపై విచక్షణా రహితంగా కొట్టడంతో తీవ్రంగా గాయపడిందని, అక్కడికక్కడే మృతి చెందిందని సాదక్ తెలిపాడు. అడ్డుకోబోయిన భర్తను కూడా తీవ్రంగా గాయపరిచారని, ఆస్రా బేగం (45) మరణించడంతో అతడు అక్కడి నుంచి పారిపోయాడని వెల్లడించారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న గజ్వేల్ పోలీసులు క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ సాధిక్‌ను చికిత్స నిమిత్తం గజ్వేల్ ఆసుపత్రికి తరలించారు. సాధిక్ ఫిర్యాదు మేరకు గజ్వేల్ పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేపట్టారు. విషయం తెలుసుకున్న మృతురాలి కుటుంబసభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు.






