- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Brutal Murder: రాష్ట్రంలో మరో దారుణం.. కూతురు కళ్లెదుటే భార్యను చంపిన భర్త
నడిరోడ్డుపై కట్టుకున్న భార్యను భర్తే హతమార్చిన భయానక ఘటన ఖమ్మం జిల్లాలో ఈ రోజు ఉదయం చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: నడిరోడ్డుపై కట్టుకున్న భార్యను భర్తే హతమార్చిన భయానక ఘటన ఖమ్మం జిల్లాలో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం పట్టణంలోని గట్టయ్య సెంటర్ ప్రాంతంలో భాస్కర్, సాయివాణి దంపతులు కొన్నాళ్లుగా నివాసం ఉంటున్నారు. అయితే, ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి ఇటీవలే విడిపోయి వేర్వేరుగా నివసిస్తున్నారు. దీంతో భార్య సాయివాణిపై పీకల్లోతు కోపాన్ని పెంచుకున్న భాస్కర్.. ఎలాగైనా ఆమెను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం భాస్కర్, సాయివాణి ఉన్న ఇంట్లోకి వెళ్లి ఆమె కత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆమె రక్తపు మడుగులో పడి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. అనంతరం అడ్డుకోబోయిన కుమార్తెపై కూడా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story






