Brutal Murder: రాష్ట్రంలో మరో దారుణం.. భర్తను కత్తితో నరికి చంపిన భార్య

by Kema Shiva Kumar |

మంచిర్యాల జిల్లా మందమర్రిలో దారుణం చోటుచేసుకుంది. వేధింపులు తట్టుకోలేక భర్త మోయిన్‌ను భార్య అవంతి కత్తితో నరికి చంపింది.

Brutal Murder: రాష్ట్రంలో మరో దారుణం.. భర్తను కత్తితో నరికి చంపిన భార్య
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను భార్య కిరాతకంగా అంతమొందించిందిన భయానక ఘటన మంచిర్యాల (Manchiryal) జిల్లాలో ఇవాళ చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మందమర్రి పట్టణంలోని శాంతి నగర్‌‌కు చెందిన మోయిన్ (Moin), అవంతి (Avanti) గతంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లయిన కొత్తలో సజావుగానే సాగిన వీరి సంసారంలో కొద్దిరోజులుగా కలహాలు మొదలయ్యాయి.

ఈ క్రమంలోనే ఇవాళ భార్యాభర్తల మధ్య గొడవ పెద్దదవ్వడంతో ఆవేశానికి లోనైన అవంతి, ఇంట్లోని కత్తితో భర్త మోయిన్‌పై విచక్షణారహితంగా దాడి చేసింది. తీవ్ర రక్తస్రావమైన మోయిన్‌ను గమనించిన స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, పరిస్థితి విషమించడంతో మోయిన్ అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. భర్త వేధింపులే ఈ హత్యకు ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. మోయిన్, అవంతిది ప్రేమ వివాహం అయినప్పటికీ, మోయిన్ తరచూ తనను వేధించేవాడని, ఆ బాధ భరించలేకే భార్య అవంతి ఘాతుకానికి పాల్పడినట్లుగా ప్రచారం జరుగుతోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు, నిందితురాలు అవంతిని అదుపులోకి తీసుకోనున్నారు.

Next Story