Brutal Murder: నగరంలో మరో దారుణం.. ఏడేళ్ల బాలుడి దారుణ హత్య

by Kema Shiva Kumar |

ఏడేళ్ల బాలుడు దారుణ హత్యకు గురైన హృదయ విదారక ఘటన నగరంలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.

Brutal Murder: నగరంలో మరో దారుణం.. ఏడేళ్ల బాలుడి దారుణ హత్య
X

దిశ, వెబ్‌డెస్క్: ఏడేళ్ల బాలుడు దారుణ హత్యకు గురైన హృదయ విదారక ఘటన నగరంలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అత్తాపూర్ (Attapur) పీఎస్ పరిధిలో ఏడేళ్ల బాలుడిని గుర్తు తెలియని దుండగులు రాళ్లతో తలపై కొట్టి హతమార్చారు. అనంతరం ఆ మృతదేహాన్ని మీరాలం (Meer Aaalam) ట్యాంక్ సమీపంలో పడేశారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు. అదేవిధంగా హత్య జరిగిన ప్రాంతాల్లో పలు కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే, మృతుడు నక్లెస్‌ రోడ్డు ప్రాంతానికి చెందిన మహమ్మద్ రహీమ్‌ (Mohammed Rahim)గా గుర్తించారు. మృతుడి పూర్తి వివరాలకు మిస్సింగ్ కేసుల వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Next Story