- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌లో యువతిపై దారుణం.. గోర్లు పీకేసి అత్యాచారం
ప్రేమించిన యువతిపై దారుణంగా దాడి చేసి.. గోర్లు పీకేసి ప్రియుడు అత్యాచారం చేశాడు. ఈ ఘోర సంఘటన హైదరాబాద్ నగరంలోని సోమాజిగూడలో చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

దిశ, వెబ్ డెస్క్: ప్రేమించిన యువతిపై దారుణంగా దాడి చేసి.. గోర్లు పీకేసి ప్రియుడు అత్యాచారం చేశాడు. ఈ ఘోర సంఘటన హైదరాబాద్ నగరంలోని సోమాజిగూడలో చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేటకు చెందిన అంకి భానుప్రకాష్ (23) అనే ఐటీ ఉద్యోగి, సోమాజిగూడ ప్రాంతానికి చెందిన యువతితో సోషల్ మీడియాలో పరిచయం ఏర్పరుచుకున్నాడు. కాలక్రమంలో స్నేహం ప్రేమగా మారి, వివాహం చేసుకునే వరకు వెళ్లింది. అతను యువతిని పెళ్లి చేసుకుంటానని అనేకసార్లు హామీ ఇచ్చాడు. కానీ కొద్ది రోజుల తర్వాత వ్యక్తిగత విభేదాలు తలెత్తడంతో ఇద్దరి మధ్య తగాదాలు మొదలయ్యాయి. ఇటీవల భానుప్రకాష్ యువతి నివాసానికి వెళ్లి వాగ్వాదం జరగగా, ఆగ్రహానికి లోనైన అతడు ఆమెను నిర్బంధించి దాడికి పాల్పడ్డాడు.
గోర్లు పీకేసి, కత్తెరతో దాడి చేసి.. అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం కూడా యువతిని తీవ్ర హింసకు గురి చేశాడు. దీంతో బాధితురాలు తీవ్రంగా గాయపడగా, ఆత్మస్థైర్యం కోల్పోకుండా పోలీసులను సంప్రదించింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు తక్షణమే స్పందించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన నగరంలో తీవ్ర కలకలం రేపుతోంది. ప్రేమ పేరుతో యువతిపై దాడులు పెరుగుతున్న తరుణంలో ఇలాంటి సంఘటనలు మహిళల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.






