ఏపీలో పరువు హత్య కలకలం.. తమ చెల్లిని పెళ్లి చేసుకున్నాడని యువకుడి దారుణ హత్య

by Ajay Maddhiboyina |

ఏపీలో ప‌రువు హ‌త్య క‌ల‌క‌లం రేపింది. త‌మ చెల్లి వేరే కులం వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుంద‌ని ఆమె సోద‌రులు యువకుడిని దారుణంగా హ‌త్య చేశారు.

ఏపీలో పరువు హత్య కలకలం.. తమ చెల్లిని పెళ్లి చేసుకున్నాడని యువకుడి దారుణ హత్య
X

దిశ‌, వెబ్ డెస్క్: ఏపీలో ప‌రువు హ‌త్య క‌ల‌క‌లం రేపింది. త‌మ చెల్లి వేరే కులం వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుంద‌ని ఆమె సోద‌రులు యువకుడిని దారుణంగా హ‌త్య చేశారు. ఈ ఘ‌ట‌న తూర్పుగోదావ‌రి జిల్లాలోని ద్వారక‌పూడిలో చోటు చేసుకుంది. సూర్య ప్ర‌కాష్, సంధ్య అనే జంట కొంత‌కాలం నుండి ప్రేమించుకుంటున్నారు. ఈ క్ర‌మంలో సూర్య ప్ర‌కాష్ వేరే కులానికి చెందిన యువ‌కుడు కావ‌డంతో పెళ్లికి నిరాక‌రించారు. దీంతో సూర్య ప్ర‌కాష్, సంధ్య గురువారం అన్న‌వ‌రంలో పెళ్లి చేసుకున్నారు. అది జీర్ణించుకోలేక‌పోయిన యువ‌తి సోద‌రులు సూర్య‌ప్ర‌కాష్ ను ఎలాగైనా హ‌త‌మార్చాల‌ని ప్లాన్ చేశారు. వేముల‌ప‌ల్లిలో యువ‌కుడి కోసం దారికాచి దారుణంగా హ‌త‌మార్చారు. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు. సంధ్య రాయ‌వ‌రంలో డిప్యూటీ త‌హసీల్దార్‌గా ప‌నిచేస్తోంది.

Next Story