- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లవర్ తో ఫోన్ మాట్లాడుతుందని అక్కను హత్య చేసిన తమ్ముడు
by Muthe.Rajitha |
రంగారెడ్డి(Rangareddy) జిల్లాలో నేడు దారుణ హత్య జరిగింది.

X
దిశ, వెబ్ డెస్క్ : రంగారెడ్డి(Rangareddy) జిల్లాలో నేడు దారుణ హత్య జరిగింది. జిల్లాలోని కొత్తూరు మండలం పెంజర్ల(Penajrla) గ్రామంలో రోహిత్ అనే యువకుడు తన అక్క రుచితను దారుణంగా హత్య(Murder) చేసాడు. రుచిత తన లవర్ తో ఫోన్ మాట్లాడుతుందని ఆగ్రహించిన రోహిత్ ఆమెను కత్తితో పొడిచి చంపేశాడు. అయితే రుచిత ప్రియునితో ఫోన్లో మాట్లాడటాన్ని గతంలో కూడా రోహిత్ అనేకసార్లు వ్యతిరేకించడంతోపాటు, తీవ్రంగా హెచ్చరించినట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సోమవారం మధ్యాహ్నం కూడా రుచిత మరోసారి ఫోన్లో మాట్లాడుతుండటంతో ఆగ్రహంతో అక్కను గొంతు కోసి మర్డర్ చేసాడు. కుటుంబ సభ్యులు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రోహిత్‌ను అదుపులోకి తీసుకున్నారు. రుచిత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Next Story






