- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంటి తాళాలు పగులగొట్టి చోరీ..
by Taduka Kalyani |
ఇంటి తాళాలు పగుల గొట్టి బీరువాలోని నగదు, నగలను అపహరించుకెళ్లిన సంఘటన నేరేడ్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

X
దిశ, మల్కాజిగిరి: ఇంటి తాళాలు పగుల గొట్టి బీరువాలోని నగదు, నగలను అపహరించుకెళ్లిన సంఘటన నేరేడ్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నేరేడ్ మెట్ బ్యాంకుకాలనీ ఆర్కేపురంలో శనివారం ఓ ఇంటి యాజమానురాలు ఆకారపు మారతమ్మ తన ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లింది. ఆదివారం ఉదయం వచ్చి చూడగా ఇంటి తాళం పగులగొట్టి కనిపించడంతో దొంగతనం జరిగిందని గుర్తించింది.
గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తలుపు తాళం పగలగొట్టి ఇంట్లో బీరువాలోని రెండు తులాల బంగారం, నగదు ఎత్తుకెళ్లారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇంటికి తాళం వేసి ఊరికి వెళుతున్నవారు విషయాన్ని ఇంటి అడ్రస్ తో పోలీస్ స్టేషన్ లో తెలియజేస్తే వారింటి వద్ధ ప్రత్యేక గస్తీ ఏర్పాటు చేస్తామన్నారు.
Next Story






