రెండున్నర కోట్ల కట్నం వాళ్లకు సరిపోలేదు నాన్న.. వంద కోట్లు కావాలట.. నవ వధువు సూసైడ్

by Sujitha Rachapalli |

తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది. వివాహం జరిగిన మూడు నెలలకే నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. 80 తులాల బంగారం, 50 లక్షల కట్నం, వోల్వో కారు ఇచ్చినా.. అదనపు వరకట్నం కోసం టార్చర్ చేశారు భర్త, అత్తమామలు.

రెండున్నర కోట్ల కట్నం వాళ్లకు సరిపోలేదు నాన్న.. వంద కోట్లు కావాలట.. నవ వధువు సూసైడ్
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది. వివాహం జరిగిన మూడు నెలలకే నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. 80 తులాల బంగారం, 50 లక్షల కట్నం, వోల్వో కారు ఇచ్చినా.. అదనపు వరకట్నం కోసం టార్చర్ చేశారు భర్త, అత్తమామలు. మానసికంగా, శారీరకంగా వేధించారు. దీంతో తండ్రికి ఏడు ఆడియో నోట్స్ పంపించిన ఆమె పురుగుల మందు తాగి చనిపోయింది.

తమిళనాడులోని తిరుప్పూర్‌కు చెందిన 27 ఏళ్ల రిధన్య‌ను.. ఏప్రిల్ 11న కవిన్ కుమార్ (28)కు ఇచ్చి పెళ్లి చేశారు. కానీ వివాహమైన పది రోజులకే అదనపు కట్నం వేధింపులు మొదలయ్యాయి. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు, బంధువులకు చెప్పినా.. అంతా సర్దుకుంటుందని, పెళ్లి చేసుకున్నాక భరించాలని చెప్పారు. కానీ మెంటల్, ఫిజికల్ టార్చర్ తట్టుకోలేని ఆమె.. పెళ్లి అయిన 78 రోజుల తర్వాత జూన్ 29న ఆత్మహత్య చేసుకుంది. అత్తగారి ఇంటి నుంచి మొండిపాళయం ఆలయానికి వెళ్తున్నట్లు చెప్పి బయలుదేరిన ఆమె.. దారిలోనే పురుగుల మందు తాగింది. నోటిలో నురగతో అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను చూసిన స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆమె మృతదేహాన్ని తిరుప్పూర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్‌మార్టం కోసం తరలించారు.

రిధన్య.. తిరుప్పూర్‌కు చెందిన గార్మెంట్ వ్యాపారి, మాజీ రాజకీయ నాయకుడు అణ్ణాదురై కుమార్తె. కాగా ఆమె పెళ్లి ₹2.5 కోట్ల వ్యయంతో ఘనంగా జరిగింది. కాగా చనిపోయే ముందు ఆమె.. తన తండ్రి అణ్ణాదురైకి ఏడు వాట్సాప్ వాయిస్ సందేశాలు పంపింది. భర్త, అత్తమామ వేధింపుల గురించి ఇందులో వివరించిన ఆమె.. భర్తతో జీవితం నచ్చట్లేదని, అంతా అయిపోయింది సారీ నాన్న.. అంటూ వాయిస్ పెట్టి ఆత్మహత్య చేసుకుంది. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త, అత్తమామలపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా అత్తింటి వారితో ఈ విషయం గురించి తల్లిదండ్రులు గతంలో ప్రశ్నిస్తే.. వంద కోట్లు కట్నం తీసుకునేవారు లేరా అని తమనే బెదిరించినట్లు పోలీసులకు తెలిపాడు మృతురాలి తండ్రి.

Next Story