హుజూర్‌నగర్‌లో లంచం కలకలం.. ఏసీబీ ఎంట్రీతో అంతా షాక్!

by Gantepaka Srikanth |   (  Updated:2025-06-28 11:38:47  IST  )

సూర్యాపేట(Suryapet) జిల్లా హుజూర్‌నగర్‌లో లంచం కలకలం రేపింది.

హుజూర్‌నగర్‌లో లంచం కలకలం.. ఏసీబీ ఎంట్రీతో అంతా షాక్!
X

దిశ, వెబ్‌డెస్క్: సూర్యాపేట(Suryapet) జిల్లా హుజూర్‌నగర్‌లో లంచం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. కరక్కాయల గూడెం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఇటీవల పొలం రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ప్రొసీడింగ్ పేపర్స్ కోసం శనివారం హుజూర్‌నగర్ ఎమ్మార్వో ఆఫీస్‌(Huzurnagar MRO Office)కు వెళ్లాడు. ఎమ్మార్వో ఆఫీస్‌లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న వ్యక్తి.. రూ.20 వేలు లంచం(Bribe) డిమాండ్ చేశాడు. చివరకు బాధితులు రూ.12 వేలు ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. అనంతరం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. శనివారం పక్కా ప్లాన్‌తో బాధితులు ఎమ్మారో ఆఫీస్‌కు వచ్చారు. కంప్యూటర్ ఆపరేటర్‌కు లంచం ఇస్తుండగా.. ఒక్కసాగా ఏసీబీ అధికారులు ఎంట్రీ ఇచ్చారు. లంచం తీసుకుంటున్న కంప్యూటర్ ఆపరేటర్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




Next Story