- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అసభ్యకర వీడియోలు వైరల్ చేస్తున్నారు.. కోర్టుకు BR నాయుడు బాధితురాలు
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఓ మహిళతో రిలేషన్‌షిప్‌లో ఉన్నారని.. ఆమెను లోబర్చుకోవడమే కాకుండా ఆమెను భయపెట్టినట్లుగా చూపించే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు(BR Naidu) ఓ మహిళతో రిలేషన్‌షిప్‌లో ఉన్నారని.. ఆమెను లోబర్చుకోవడమే కాకుండా ఆమెను భయపెట్టినట్లుగా చూపించే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ అంశంపై బాధితురాలు లక్ష్మి భార్గవి తీవ్రంగా స్పందించారు. రాజేంద్ర నగర్ కోర్టు(Rajendra Nagar Court)లో పిటిషన్ దాఖలు చేశారు. అంతకుముందు ఏఐ డీప్‌ఫేక్‌తో తన ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్ చేశారని రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆస్ట్రేలియా, కెనడా నుంచి డీఫ్ ఫేక్‌తో సోషల్ మీడియాలో అసభ్య కంటెంట్ వైరల్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు చేస్తారని ఆవేదన చెందారు. ఈ అసభ్యకర వీడియోల వల్ల తమ కుటుంబం మొత్తం మానసిక వేదనకు గురవుతున్నామని అన్నారు. అసభ్య కంటెంట్ వైరల్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆమె డిమాండ్ చేశారు. బీఆర్ నాయుడు లాంటి అతి పవిత్రమైన వ్యక్తిపై నిందలు వేయడానికి సిగ్గుండాలి అని అంతకుముందు వీడియోలో మండిపడ్డారు.






